భైంసాలో అందుబాటులోకి ఫ్రీజర్ సేవలు
*డా.ముత్యం రెడ్డి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చిత్రం న్యూస్,భైంసా: తన తల్లి అమృతాబాయి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ముత్యం రెడ్డి కుటుంబీకులు ఒక ప్రత్యేక సేవను శనివారం అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచారు. మాతృమూర్తి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ సదుపాయం స్థానికులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు, వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దూరప్రాంతాల నుంచి...