బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కోగ్దూర్ గ్రామానికి చెందిన చొకాజీ నింసత్కర్ మరియు హేటి గ్రామానికి చెందిన నాందేవ్ ఠాక్రే (మహాజన్) ఇటీవల మరణించడంతో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్ళెం ప్రమోద్ రెడ్డి, యువ నాయకుడు సతీష్ పవార్, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ తేజ్రావు మస్కే, విశాల్ గోడే,సుదర్శన్ బత్తుల, సుధాకర్ చౌహాన్ తదితరులు ఉన్నారు.