ఘనంగా పొలాల పండగ
*ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తున్న జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పొలాల అమావాస్య పండగను జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి_వెంకట్ రెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణం శాంతి నగర్ లోని వారి నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం బసవన్నలకు నైవేద్యం సమర్పించారు. ప్రజలు పాడిపంటలు, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.