పొలాల వేళ.. అన్నదాతలకు అండగా
*సామాజిక కార్యకర్త మంగదుడ్ల మహేందర్ యాదవ్ ఉదారత
చిత్రం న్యూస్, భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడూర్, అర్లి (టి) గ్రామాల్లో పొలాల అమావాస్య పండగను ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త మంగదుడ్ల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వడూర్, అర్లిటి గ్రామాల్లో చూడ ముచ్చటగా బసవన్నలను అలకరించిన రైతులకు పంపుసెట్లు, టార్చిలైట్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను బహుమతులుగా ప్రధానం చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. రైతు నేస్తాలైన బసవన్నలను పూజించుకోవడం రైతుల్లో గొప్ప పండగ అన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో జరుపుకోవడం మత సామరస్యం తో ఐక్యమత్యానికి పొలాల పండగ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వడూర్ గ్రామ పెద్దలు హన్మాండ్లు యాదవ్, మాజీ సర్పంచ్ హన్మాందాస్ యాదవ్, రమణారెడ్డి, సుదర్శన్, సంజీవ్ రెడ్డి, కావటి దేవరెడ్డి, అడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, అనిల్ యాదవ్, అర్లి t మాజీ సర్పంచ్ గొల్లి లస్మయ్య, వీడీసీ చైర్మన్ ఓమన్న, గ్రామ పెద్దలు కామన్వార్అశోక్, రాహుఫ్, నందు, ఉల్లాస్ పటేల్, గజానన్ యాదవ్, గంగయ్య, మాజీ ఎంపీటీసీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.