జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు
*సత్యాగ్రహ దీక్ష చేపట్టిన పాల్వాయి హరీశ్
*నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
చిత్రం న్యూస్, కాగజ్ నగర్: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను బీజేపి ఎమ్మెల్యేలు విరమింపజేసారు. జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శుక్రవారం పాల్వాయి హరీష్ బాబును బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేశ్ రెడ్డి, కాట్ పెల్లి వెంకటరమణ రెడ్డి లు పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ. సందర్భంగా బీజేపి ఎమ్మెల్యేలు మట్లాడుతూ..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 రద్దు చేస్తున్నామని కేవలం ప్రకటించిందని, దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు జీవో 49 రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపి పార్టే ఆధ్వర్యంలో ప్రభుత్వంపై భారీ ఎత్తున పోరాటం చేస్తామని పేర్కొన్నారు.