సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు
*బసవన్నలకు ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. బోథ్ మరియు సొనాల మండల కేంద్రాల్లో శ్రావణ మాస ఉత్సవాల సందడిలో భాగంగా పొలాల బసవన్నల ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వానలు బాగా కురవాలి, పొలాలు పచ్చగా కళకళలాడాలి. పంటలు బాగా పండాలని ఆకాంక్షతో గ్రామ పెద్దలు, యువత బసవన్నలను పూలమాలలతో, రంగురంగుల వస్త్రాలతో అలంకరించి గ్రామ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. డోలు వాయిద్యాల మధ్యన ఊరేగింపు గ్రామమంతా సందడిగా సాగింది.రైతులు బసవన్నలకు పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని మొక్కులు తీర్చుకున్నారు. బసవన్నల ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈ సాంప్రదాయం తరతరాలకు సంక్రమించి కొనసాగాలని, రైతు జీవితంలో బసవన్నకు ఉన్న ప్రాధాన్యతను కొత్త తరం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. పొలాల అమావాస్యలో శాస్త్రీయత దాగి ఉందని పెద్దలు తెలిపారు..