ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నబోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, మావల: నిత్యం రైతుకి సహాయపడే పశువులను పూజించే గొప్ప పండగ పొలాల అమావాస్య పండగను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం మావలలోని నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకు శ్రీకాంత్ రెడ్డి, అయన సోదరుడు ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని హనుమాన్, పోచమ్మ ఆలయాల్లో డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్ల ఊరేగింపు ఏంతో వేడుకగా నిర్వహించారు. రైతులు, యువకులు, గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎడ్ల ఊరేగింపులో పాల్గొన్నారు.