ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గిఫ్ట్ డీడ్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన జాయిట్ సబ్ రిజిస్ట్రారర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. గమనించిన కొంత మంది కార్యాలయ సిబ్బంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరపగా..లంచం తీసుకుంటున్న జాయింట్ రిజిస్ర్త్రార్ ను అదుపులోకి తీసుకున్నారు. సిలికన్ పరీక్ష నిర్వహించి పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. బాదితుడు బేల మండలం సిర్సన్నకు చెందిన మన్సుర్ ఖాన్ పటాన్ తన భార్య గౌసియ బేగం పేరున ఉన్న ఇంటిని తనపై గిఫ్ట్ డీడ్ కోసం ఈనెల 19న ముదస్సిర్ షా అనే డాక్యుమెంట్ రైటర్ తో పత్రాలు తయారు చేశారు. 20వ తేదిన జాయింట్ రిజిస్ట్రారర్ వద్దకు పత్రాలను పరిశీలించి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాదితుడు దానికి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం గిఫ్ట్ డీడ్ అయిన తరువాత ఐదు వేలు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీఎస్పీ మధు తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన లంచం అడిగితే పోలీసులు లేదా ఏసీబీని సంప్రదించాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని తెలిపారు. అయితే ఇంచార్జ్ బాధ్యతల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతంలో కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి బయటకు రావడం గమనార్హం.
-Advertisement-