ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
చిత్రం న్యూస్, కైకలూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కైకలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి కళామండపంలో ప్రముఖ సినీ నటుడు, పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. కొణిదల చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కైకలూరు వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కామినేని గారు చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహరావు గారు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.