ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ
చిత్రం న్యూస్, నేరడిగొండ: మెకానిక్ రంగంలో ఆసక్తిగల యువత ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు ఉచితంగా అందించే ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ సర్వీస్ అసిస్టెంట్ కోర్సులో చేరాలని mentor రమణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ లోని కుప్టి, గాజలి, గాందారి యువకులకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఉచిత శిక్షణ ఇస్తున్నటువoటి అంశాలను వివరించారు. ఆసక్తి గల యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. శిక్షణ సమయంలో భోజనం, హాస్టల్ వసతి ఉచితంగా అందిస్తామన్నారు. శిక్షణ హైదరాబాద్ లోని నాగోల్ లో ఉంటుందాని, కనీసం పదో తరగతి పాసై, 18 నుండి 30 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలన్నారు. కోర్సు వ్యవధి 45 రోజులు ఉంటుందని, మరిన్ని వివరాలకు 9959346423 నెంబర్ సంప్రదించాలన్నారు. హైదరాబాద్ శిక్షణ పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్ కూడా ఇవ్వబడుతుందని చెప్పారు.