ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి
*రేపు భైంసాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాక
చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సుర్ లోక్ గార్డెన్స్ లో 3 గంటలకు (SURLOK GARDENS) వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల సన్నాహక గర్జన సదస్సును శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) హాజరు కానున్నారు. ఈ సందర్బంగా వికలాంగులకు 6 వేలు వృద్ధులు, వితంతువలు, ఒంటరి మహిళలకు 4 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్పీ అంబేకర్ సాయిచంద్ మాదిగ మాట్లాడారు. సమావేశం (SURLOK GARDENS) ఫంక్షన్ హాల్ భైంసా పట్టణం లో నిర్వహించనున్నారు. ఈ సభను ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని గురువారం ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నిర్మల్ ఇచ్చార్జ్ గాంధిమల నాగభూషణ్ మాదిగ,ఎమ్మార్పీఎస్, ఎమ్మేస్పీ జాతీయ నాయకుడు నందుకుమార్ మాదిగ, ఎమ్ఇ యఫ్ రాష్ట్ర ఉప అధ్యక్షులు గాయక్ గంగాధర్ మాదిగ,ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నిర్మల్ జిల్లా నాయకుడు దిగంబర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గోనెకర్ శంకర్, శేల్లె ఆనంద్ పాల్గొన్నారు.