అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
చిత్రం న్యూస్, నేరడిగొండ: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమారి గ్రామంలో చోటుచేసుకుంది నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ , తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (38) ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా తనకున్న మూడు ఎకరాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. అప్పులు ఎక్కవగా ఉండడంతో ఇక పంట నష్టం జరిగిందని మనస్థాపానికి గురై తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లస్మన్నకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.