ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులు
చిత్రం న్యూస్, సామర్లకోట: నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మండలానికి వచ్చే 1000 మంది లెర్నర్స్ ను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చుట కోసం ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులను వాలంటీర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం సామర్లకోట మండలంలో గురువారం మధ్యాహ్నం 2 గం.టలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కె.హిమమహేశ్వరి, మండల విద్యాశాఖాధికారి శ్రీ వై.శివరామ కృష్ణయ్య, APM జగదీశ్వరి, పి.పనయ్య -Deputy Director ,Adult Education, అనిశెట్టి వెంకటరావు, Nodal Officer, Eastgodavari, వి.సునీల్ ఆనంద్ బాబు, Statistical Assistant (i/c) , Samalkot R/U , పి.రాజేష్, Statistical Assistant, Adult Education, Kakinada, యం.నాగేశ్వరరావు , PS HM ,Samalkot U-RP , డి. వీరన్న, SGT, Samalkot U-RP, యస్.రాజు. SGT, Samalkot U-RP తదితరులు పాల్గొన్నారు.