శాశ్వత పోస్టులు భర్తీ
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడిన సొనాల మండల తహసీల్దార్ కార్యాలయంలో క్యాడర్ పూర్తి స్ట్రెంత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్, సిబ్బందికి శాలువా తో సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..కొత్త మండలంలో అన్ని శాశ్వత పోస్టులు భర్తీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కు ధన్యవాదాలు తెలిపారు. సొనాల మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ను త్వరలో ఏర్పాటుచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు చెట్లపెళ్లి అనిల్, రామాయి రాము, కసిరే పోతన్న, బాశెట్టి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.