పారిశుధ్య కార్మికులకు సన్మానం
చిత్రం న్యూస్, గజ్వేల్: ఎస్సీలకు చెందిన అన్ని కులాల వారు కష్ట కాలంలో, శుభ కార్యక్రమాల్లో కలసి మెలసి ఉండాలని, మనం ఎస్సీలు కాదు హిందువులమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యాంప్రసాద్ జీ అన్నారు. హిందువులందరి మధ్య బంధు భావన నిర్మాణం కోసం సామాజిక సమరసత వేదిక దేశ వ్యాప్తంగా పని చేస్తోందని శ్యామ్ ప్రసాద్ జీ వివరించారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో 21 ఆగస్టున ప్రజ్ఞాపూర్ లోని ప్రముఖ దంత వైద్యులు, జిల్లా దంత వైద్యుల అసోసియషన్ అధ్యక్షులు డా.శ్రీధర్ ఇంట్లో జరిగిన సమావేశానికి డా,ఆకుల నరేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎస్సీలకు చెందిన నాల్గు కులాల వారు పాల్గొన్నారు. బైండల,చిందు కులాలకు చెందిన వారు పాటలు పాడారు. వారికి మాదిగ,మాల కులస్తులకు చెందిన పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. తరువాత కలసి సామూహిక భోజనం చేశారు. ఎస్సీ కులాల వారు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లాలని, ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలని, వారిని బాగా చదివించాలని కోరారు. విద్యార్థి విభాగం ప్రముఖ్ శ్రీ కృష్ణ, అడ్వకేట్ శ్రీకాంత్ పారిశుధ్య కార్మికుల ఆర్థిక,సామాజిక స్థితి గతులపై సర్వే చేశారు.తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్, డా.శ్రీధర్, డా.సాయినాధ రెడ్డి, డా. శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు.