Chitram news
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 10:55 am Editor : Chitram news

గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి_కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, భైంసా: గణేష్ ఉత్సవాలు సోదరభావంతో,శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పీస్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండపాల వద్ద కచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదన్నారు. మద్యం తాగి మండపాల వద్ద ఉండరాదని, డీజేలు, లౌడ్ స్పీకర్లతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో కచ్చితంగా విద్యుత్తు సరఫరాతో పాటు తగు సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించాలన్నారు. విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏ ఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.