ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి
ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్
చిత్రం న్యూస్, సొనాల:
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలని ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్లాస్టికేతర బ్యాగులనే వాడాలంటూ వారసంతలో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనే భూతం పర్యావరణాన్ని, నాశనం చేస్తూ, కాలుష్య కారినిగా తయారైందని ప్లాస్టిక్ వాడకంతో నీరు భూమిలో ఇంకకుండా పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని, అదేవిధంగా క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు చెట్ల పెళ్లి అనిల్, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఏఎంసీ డైరెక్టర్, ఇస్రూ పటేల్, బీసీ సెల్ ఛైర్మన్ జంగాల భోజన్న , కసిరే పోతన్న, మాజీ సర్పంచ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.