వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటన
బైక్ పై తిరుగుతూ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు నీట మునగడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతులు అధైర్యపడవద్దని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అటు అధికారులు సైతం గుంట భూమిని కూడా వదలకుండా నష్టపోయిన ప్రతి భూమిలో సర్వేలు నిర్వహించి, త్వరితగతిన నివేదికలు...