మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆధునిక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారత దేశాన్ని ఐటీ, టెలికాం, అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు కృషిచేశారని తెలిపారు. ఆయన పాలనలో పేదరిక నిర్మూలనకు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత పయనించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ కో -ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు మర్సుకోలా గౌతమ్, మాజీ కౌన్సిలర్ ముర్తుజా,మాజీ టౌన్ అధ్యక్షులు వసీం, సీనియర్ నాయకులు అలీమ్, కొరటి ప్రభాకర్, ఎండీ ఆఫ్సర్, ముత్యాల మహేందర్, ప్రజ్ఞషిల్, షేక్ రహీమ్, ఆఫ్సర్ ఖాన్, రెండ్ల రాజన్న, దినేష్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.