ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం
*మాట్లాడుతున్న జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ జీ
చిత్రం న్యూస్, రంగారెడ్డి: సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంయుక్త నిర్వహణలో భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సమావేశం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ లోని గీతా భవన్ లో నిర్వహించారు. 21 కులాలకు చెందిన 55 మంది పాల్గొన్నారు. ప్రతి కులం నుండి ఒకరినీ సన్మానించారు. మనము, ఎస్సీ కులస్తులు సోదరులమనే భావనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం మేరకు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఒక కుల దేవత, చరిత్ర ఉంది. 75 సం,ల రాజ్యాంగం అమలులో అభివృద్ధి ఫలాలు అన్ని ఎస్సీ కులాలకు సమంగా చేరలేదని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని, ఎస్సీలకు చెందిన అన్ని కులాలవారికీ, అందరి ప్రగతి కోసం కలసి మెలసి పని చేయాలనన్నారు. రాజకీయాలు అవసరమే! అయితే రాజకీయాలు మాత్రమే అనుసరిస్తే అవి ప్రజలను విడదీస్తాయని, ధర్మ,సంస్కృతులు మాత్రమే ప్రజలను సమైక్యం చేస్థాయని” శ్రీ శ్యామ్ ప్రసాద్ జీ, జాతీయ కన్వీనర్ తమ ప్రస్తావనలో పేర్కొన్నారు.అలాగే ఎస్సీ కులాలకు, మిగతా కులాల మధ్య అంతరాల గురించి ప్రశ్నించే వాళ్ళు వివిధ ఎస్సీ కులాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్ష చేసుకోవాలని శ్రీ శ్యామ్ జీ గుర్తు చేశారు. మన అందరి మధ్య మరింతగా సద్భావం, సోదర భావం పెరగడానికి మనం ఏమేమి చేయగలమో అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలిపారు. ఈ చర్చలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
మనం ఎస్సీలం మాత్రమే కాదు హిందువులము కూడా!
అరుంధతి మాత హిందువుల అందరికీ ఆదర్శ స్త్రీ, వివాహం అనంతరం అన్ని కులాలకు చెందిన కొత్త దంపతులు వశిష్ట- అరుంధతి నక్షత్రాలు చూస్తారు కదా! 17 వ శతాబ్దంలో తమిళనాడులోని శివగంగకోట పై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తు ఆత్మ బలిదానం చేసిన యువతి *కుయిలి* ఎస్సీ మహిళయని శ్రీ సత్యనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగింపు సమావేశంలో ప్రసంగించారు. భాగ్యరెడ్డి వర్మ మనువడు శ్రీ అజయ్ గౌతమ్ దంపతులు పాల్గొని, భాగ్యరెడ్డి వర్మ గారి సేవా కార్య క్రమాలను గుర్తుచేశారు.సమావేశ నిర్వాహణను డా,వెంకట నరసయ్య, సీనియర్ శాస్త్రవేత్త IICT చేశారు. కార్యక్రమంలో శ్రీ మారేడు మోహన్ ( రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి), శ్రీ వేణుగోపాల్, సమరసత తెలంగాణ సహా కన్వీనర్, శ్రీ చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ సంచార తెగల సంఘం పాల్గొన్నారు. కొంపల్లి అరవింద్, ప్రతాప్, వేముల శ్యామ్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో తమ పాత్ర పోషించారు.