వరదలపై అధికారులతో సమీక్ష.. పంటలు పరిశీలన
నష్టం అంచనా వేసి సమగ్ర నివేదిక అందించాలి *ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తాజా వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్ గంగా గెస్ట్ హౌజ్ లో అధికారులతో మంత్రి సమీక్షించారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన...