ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
చిత్రం న్యూస్, బేల: ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఖోగ్దూర్ ,మాoగ్రుడ్ గ్రామాలలో మంగళవారం మండల నాయకులతో కలిసి పంట నష్టపోయిన రైతుల చేలను పరిశీలించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మస్కె తేజరావు, యువ నాయకుడు సతీష్ పవార్, ఠాక్రే మంగేష్, విశాల్ గోడే, మనోజ్ గేడామ్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.*
-Advertisement-