Chitram news
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 1:02 pm Editor : Chitram news

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

చిత్రం న్యూస్, ఇచ్చోడ: వర్షాకాలంలో విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని CHO డాక్టర్ బ్రహ్మానంద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని TTWURJC AHS బాలికల హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్లోని వంటశాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెంది, డెంగ్యూ, మలేరియా, అతిసారం, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్, పి హెచ్ ఎన్ రాజుభాయి, ఏఎన్ఎంలు సుధారాణి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.