భారీ వర్షాలు…నిర్మల్ జిల్లా విద్యా సంస్థ లకు ఒక రోజు సెలవు
చిత్రం న్యూస్, భైంసా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధువారం రాష్ట్రంలో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.అతిభారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకొని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలపగా.. వాతారవరణ శాఖ సూచన మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నామన్నారు . విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడం, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోవడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు.నాడు (ఆగస్టు 20) జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132లో సంప్రదించవచ్చని తెలిపారు.