నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్
*రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని అసెంబ్లీ ప్రస్తావిస్తానని భరోసా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. మంగళవారం భీంపూర్ మండలంలో బైకుపై సుడిగాలి పర్యటన చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన కరంజి, గోముత్రి, అంతర్గావ్, అర్లి, వడూర్, గుబిడి, ధనోర, భీంపూర్, కరణ్ వాడి, పెన్ గంగా ప్రభావిత గ్రామల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. నష్టపోయిన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నష్టపోయిన రైతులకు రూ. 25వేలు పరిహారం అందించాలని వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రస్థావిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట మండల కన్వీనర్ నాగయ్య,నాయకులు లస్మన్న, నరేందర్, సంతోష్, కల్చప్, ప్రముఖ న్యాయవాది కేమ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.