అంబులెన్స్ లో ప్రసవం..తల్లీ బిడ్డలు క్షేమ
చిత్రం న్యూస్, ఇచ్చోడ:
అంబులెన్స్ లో ఓ మహిళ ప్రసవించిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముక్రా (బి) గ్రామానికి చెందిన ప్రతిక్ష అనే మహిళకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ 108కు చరవాణిలో సమాచారం ఇచ్చారు. దీంతో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతిక్ష ప్రసవించి ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, తల్లీ ఇద్దరు కవల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ పైలట్ వినోద్, ఈఎంటీ రాకేష్ తెలిపారు.