ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి
చిత్రం న్యూస్, భైంసా: లోక్ షాహిర్, సాహిత్య సామ్రాట్ అన్నా బాహు సాఠే 105 జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం లో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్నా బాహు సాఠే సాహిత్య సామ్రాట్, అన్నా బాహు సాఠే మాదిగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, అన్నా బాహు సాఠే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను చైతన్యవంతం చేసిన అన్నా బాహు సాఠే కృషిని అందరూ స్మరించుకున్నారు. కుల వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన మహా యోధుడని కొనియాడారు. నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య సామ్రాట్ మాదిగ సంఘం సభ్యులు కత్తి.బాబు,ఎ.సాయినాథ్,బీ.భోజన్న, పొచ్చిరాం, ఆనంద్, అడేల్లు, దినేష్, మారుతి, గంగాధర్, లక్ష్మన్, కె.సాయినాథ్, తరుణ్, శ్రీకిష్ణ, కె.బాబు, నరేష్, వీడిసి సభ్యులు,బీ.బాబు, కె.ఆనంద్,మానాజీ మల్లేష్, శ్యాంరావు , పోతన్న, రాములు, గంగాధర్, రాజు, శంకర్, భారత బాయి, లక్ష్మి, ఈశ్వర్ బాయి, సరస్వత, ఆనందబాయి, జనాభాయి, ఆడేల బాయి, రాజు బాయి, సాగర్ బాయి, అంబు భాయి మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.