ఆకట్టుకున్న బోధనోపకరణ మేళా
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యాసన సామాగ్రి మేళ (TLM) ఎంతగానో ఆకట్టుకుంది. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు సృజనాత్మకతతో తయారుచేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. అనంతరం 10 బోధనోపకరణాలు జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో మండల నోడల్ అధికారి కదం మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీఎల్ఎంలు ఎంతో దోహద పడతాయన్నారు. వెనుకబడిన విద్యార్థులకు సులువుగా అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరచవచ్చన్నారు.. కార్యక్రమంలో సీఆర్పీ లు ఆర్.వెంకన్న, విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.