గుడుంబా విక్రయిస్తే చర్యలు_ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్
చిత్రం న్యూస్, ఇచ్చోడ: నిషేధిత గుడుంబా విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బాబ్జిపేట్ లో కొందరు వ్యక్తులు గుడుంబా తయారుచేసి విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. బాబ్జిపేట్ కు చెందిన జాదవ్ లక్ష్మీ వద్ద 5 లీటర్ల గుడుంబా దొరికిందన్నారు. జాదవ్ లక్ష్మిని విచారించగా సిరిచెల్మలోని మహమ్మద్ షౌకత్ కిరాణ దుకాణంలో ఆమె కొన్నట్లు పేర్కొందన్నారు. అనంతరం కిరాణా దుకాణంలో దాడులు నిర్వహించగా 300 కిలోల నల్ల బెల్లం, 9 కిలోల పటికను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత గుడుంబా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ విజయలక్ష్మి, సిబ్బంది బాపురావు, మౌనిక, అరుణ, సంధ్యారాణి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.