కోలూర్‌లో కూలిన పెంకుటిల్లు_తప్పిన పెను ప్రమాదం
చిత్రం న్యూస్, తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూర్ గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన షేక్ ఉమర్‌కు చెందిన ఈ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ఆ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.