బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు
*గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో వరదనీరుతో గ్రామం అతలాకుతలం గా మారింది. ఆదివారం రోజున హెల్త్ క్యాంప్ ను తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యురాలు నైనత నిర్వహించారు. ఎంపీడీవో మహేష్ కుమార్, తహసీల్దార్ నారాయణ గ్రామంలో పర్యటించి వరద నీటిలో మునిగిన ఇండ్ల బాధితుల వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షంతో రైతులు ప్రధానంగా పంట చెన్లకు వెళ్ళే లో-లెవల్ వంతెన పక్కన దెబ్బతిన్న దారిని పరిశీలించారు. వర్ష కాలం దృష్ట్యా ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు చక్రవర్తి, ముజీబ్, గ్రామస్థులు రఘువీర్ రెడ్డి, ఉషన్న, రాకేష్ రెడ్డి, సంజీవ్ ,అభిజిత్ రెడ్డి, ఆనంద్ రావ్, నరేష్ రెడ్డి,అశన్న, చిన్నారెడ్డి, ఎల్లన్న, నర్శింగ్ రెడ్డి,గండన్న,కిస్టు తదితరులు ఉన్నారు.