పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులోని పెన్ గంగా నదిని రఘునాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, ఎగువలో ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్ట్ లో నీటిని విడుదల చేయడంతో ప్రవాహం పెరిగిందన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో పంట పొలాల్లో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చిన సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన బెదోడ, కాప్సి గ్రామాలను నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐ సాజిద్ ఖాన్, గ్రామ కార్యదర్శి వేణుగోపాలరావు, వీడీసీ అధ్యక్షుడు, భూపతి రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కదరపు ప్రవీణ్, సతీష్ గేడాం తదితరులున్నారు.