బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పీఏసీఎస్ గోదాములో యూరియా బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో ఎగువ నుండి వచ్చిన నీరు గోదాంలోకి అధికంగా వరద నీరు రావడంతో యూరియా బస్తాలు తడిసిపోయాయి. తడిసిన యూరియా బస్తాలని కార్మికులు తీసే ప్రయత్నం చేశారు.