సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా మండలం లోకేశ్వరం నగర్ గ్రామానికి చెందిన సావిత్రి, సామ్రీన్ బేగం అనే లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను ( CM Relief Fund ) శనివారం అందజేశారు.ఆసుపత్రి ఖర్చులకోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముస్తాఫ్ సహకారంతో నగర్ గ్రామపంచాయతీ కి చెందిన సావిత్రికి రూ.30 వేలు, సామ్రీన్ బేగంకు రూ.26 వేలు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన చెక్కును బాధితులకు శనివారం మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ..సీఎం సహాయనిది పథకం పేదలకు వరం లాంటిదన్నారు. ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి,మాజీ ఉపా సర్పంచ్ ముస్తాఫ్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.