టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అత్రం సుగుణక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సొనాల మండల కాంగ్రెస్ శ్రేణులు
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ముద్దుబిడ్డ, అనునిత్యం ప్రజల కోసం ముందుండి హక్కులకై పోరాడే నాయకురాలు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జన్మదినం సందర్భంగా సొనాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గాజుల పోతన్న, రమేష్ బత్తుల మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి నుండి, నేడు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎదగడం చాలా గర్వకారణం అని, ఎన్నో ఆదివాసీ ఉద్యమాలు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెట్ల పెల్లి అనిల్, మండల నాయకులు పాల్గొన్నారు.