తిలక్ నగర్ కాలనీలో జలమయమైన ఇళ్ళు
తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు చేసి ఉదారత చాటిన సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోనితిలక్ నగర్ కాలనీవాసులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి భోజనాలు ఏర్పాటు చేయించారు. భారీ వర్షాల కారణంగా కాలనీలో ఇండ్లు నీట మునగడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే కాలనీకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి నుండి వర్షం కారణంగా శనివారం ఉదయం నుండి చాలా కుటుంబాలు వంట చేసుకోలేని పరిస్థితి ఉండడంతో వెంటనే దాదాపు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయించి ఉదారత చాటారు సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి.