*పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
*కాలనీవాసుల ఇబ్బందులను తొలగించిన సామాజిక సేవకుడు చట్ల ఉమేష్
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాయి నగర్ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఇండ్లను, తెగిన కల్వర్టును ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సందర్శించారు. కాలనీవాసులకు ధైర్యం చెప్పి పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. త్వరలోనే రోడ్లు, కల్వర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ఉన్నారు.
బోథ్ లోని సాయినగర్ కాలనీలోని రాత్రి నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న బ్రిడ్జ్ కొట్టుకుపోయి వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని సామాజిక సేవకుడు చట్ల ఉమేష్ దృష్టికి సాయి నగర్ యువత తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన అక్కడికి చేరుకొని జేసీబీతో వరద నీరు ఇళ్లలోకి రాకుండా చేయించారు. రోడ్లపైన నిలిచిన వరద నీరు వెళ్లేందుకు దారి చేయించారు. కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.