మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
చిత్రం న్యూస్, భైంసా: భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..రహదారుల నిర్మాణంతో దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించి, ప్రజల గుండెల్లో గొప్ప నాయకుడిగా కీర్తి గడించిన దార్శనికుడు, మాజీ ప్రధాని అటల్ జీ అని కొనియాడారు. వారు దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.