నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చిన రాజప్పకు వినతి పత్రం అందజేస్తున్న మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని చంద్రమాంపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ..మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్పకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి సమస్యను విన్నవించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పడినప్పుడు పాఠశాల ఆవరణణ మొత్తం నీటితో నిండిపోతుందన్నారు. దీంతో విద్యార్థులకు రాకపోకలు సాగించాలంటే ఇబ్బందిగా మారిందని, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.