ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన హెచ్ఎం రాధిక
చిత్రం న్యూస్,భైంసా: మండలంలోని వాలేగాం గ్రామాల్లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ పాఠశాల, గ్రామ పంచాయతీ, మున్నూరు కాపు సంఘం, వీరశైవ లింగాయత్, అంబేద్కర్, అన్న బాహు సాఠే విగ్రహం ముందు జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు, ప్రజలకు స్వీట్లు పంచారు.
స్వాతంత్ర్యం రావడానికి అమరులైన పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోనియా, లక్ష్మణ్, అంగన్వాడీ ఉపాధ్యాయులు సరస్వత, జ్యోతి, గ్రామ కార్యదర్శి పోతన్న, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, వీడిసి సభ్యులు రాందాస్, జె.గంగాధర్, కిషోర్ పాటిల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇరువంత్, దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ మహేష్, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.