పాఠశాలకు 3ఫ్యాన్లు అందజేస్తున్న ముక్కెర ప్రభాకర్
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన మామిడి మల్లారెడ్డి, ముక్కెర ప్రభాకర్ లు దాతృత్వం చాటారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదులకు 3 ఫ్యాన్ లను ముక్కెర ప్రభాకర్ విరాళంగా అందజేసి ఉదారతను చాటారు. ముక్కెర ప్రభాకర్ ను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సన్మానించారు.
విద్యార్థుల సౌకర్యార్థం రూ.20 వేలతో ఫ్లోరింగ్ చేయించిన మామిడి మల్లారెడ్డి
తమ గ్రామంలో చదువుతున్న పేద విద్యార్థులు పాఠశాల తరగతి గదుల్లో ఫ్లోరింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మామిడి మల్లారెడ్డి వారి సౌకర్యార్థం రూ.20 వేలు వెచ్చించి 2 తరగతి గదులు, వరండా ఫ్లోరింగ్ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM అర్చన, సైపట్ మహేందర్ రావు, బండారి వినోద్, నర్రా విఠల్ ,అర్హుల ఆశన్న, గంధం సురేష్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.