శిథిలావస్థలో హాంపోలి ప్రాథమిక పాఠశాల
*పెచ్చులూడుతున్న స్లాబ్ *ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హాంపోలి గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు భయంభయంగా విద్యనభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ప్రభుత్వ పాఠశాల ప్రమాదపుటంచున ఉంది. ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు చెందిన రెండు గదులు, శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పస్తుతం విద్యార్థులు ఉంటున్న గది కూడా...