మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ
మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండల కేంద్రంలోని గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలంగా పేద ప్రజల కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయని ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా మొదలైనటువంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు....