మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండల కేంద్రంలోని గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలంగా పేద ప్రజల కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయని ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా మొదలైనటువంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు. గ్రామాలలో గంజాయి, క్లోరోహైడ్రేట్ గురించి అవగాహన కల్పిస్తూ అరికట్టడానికి కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విద్యార్థులు వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ సంధర్భంగా మాదక ద్రవ్యాల నిరోధకంపై అధ్యాపకులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, ఎన్ఎస్ఎస్ ఓం ప్రకాష్, లెక్చరర్లు పవన్ కుమార్ ,భీమ్ రావ్, రవి కుమార్,శంకర్, పీజీ రెడ్డి, సంతోష్ కుమార్, కల్పన, నహీదా, మజర్అబ్దుల్లా, సురేందర్, కిషన్, శ్రావణ్య, అర్షియ,రామ్మోహన్, ఉజ్మ సమరిన్, వాహిద్ ,ఇర్ఫాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.