అతి భారీ వర్షాలు..72 గంటలు అలర్ట్‌గా ఉండాలి
*ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
* వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పక్కన. ఎస్పీ జానకి షర్మిల
చిత్రం న్యూస్, నిర్మల్: రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రమాదకర వంతెనలు, రహదారుల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్ని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేసి, కాజ్‌వేలు, చెరువుల వద్ద జాగ్రత్తలు, శిథిల భవనాల ఖాళీ, టామ్‌టామ్ ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. 24/7 కంట్రోల్ రూమ్ (91005 77132) ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

