విద్యార్థులకు దుస్తులు, షూ లను పంపిణీ చేస్తున్న హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతేఖాబ్ ఆలం
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ దుస్తులు, షూ లను పంపిణీ చేసి ఉదారత చాటుకుంది. ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతేఖాబ్ ఆలం, ప్రధానోపాధ్యాయురాలు సిమ్రాన్ బేగంతో కలిసి వీటిని అందజేశారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా ఉందని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఒక విద్య వాలంటరీ నియమించామన్నారు జిల్లాలో చాలా వరకు ఉర్దూ మాద్యమ పాఠశాలలో ఉర్దూ బోధించడానికి ఉపాధ్యాయుల కొరతతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ భాను,కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-Advertisement-
విద్యార్థులకు దుస్తులు, షూ ల పంపిణీ
RELATED ARTICLES