Chitram news
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 3:26 pm Editor : Chitram news

ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమము

ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమము

చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం  మేడపాడు గ్రామపంచాయతీ లోని సుప్రీమ్ LTC చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో మంగళవారం జిల్లా స్థాయి ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు , డిప్యూటీ ఎంపీడీవోలు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఈవో వివిఎస్ లక్ష్మణ్ రావు , జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ ,కాకినాడ పెద్దాపురం డివిజన్ల డీఎల్ డీవోలు వాసుదేవరావు, శ్యామల, డిఎల్పీవోలు అన్నామణి , బాలమణి, సామర్లకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కె.హిమమహేశ్వరి, అడిషనల్ రిసోర్స్ పర్సన్  పాలకుర్తి శ్రీనివాసచార్యులు, సర్పంచ్ పటానిదేవి,డిపిఆర్సి రిసోర్స్ పర్సన్స్ అచ్చిరాజు, రాజ్ కుమార్, దావీదు రాజు, ఫీల్డ్ టెక్నికల్ కోఆర్డినేటర్స్ గణేష్, రామకృష్ణ, లక్ష్మణ్ పంచాయితీ కార్యదర్శి ,భారతి తదితర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.