ఆదర్శ పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమాలు
చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా బోథ్ మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సోనాల ఆయుష్ యోగా శిక్షకురాలు మునిగెల యోగిత విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాల పైన అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. ఆమె మాట్లాడుతూ..యోగ చేయడం వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని, యోగా నిత్యజీవితంలో భాగం అవ్వాలన్నారు. శారీరకంగా ఎన్నో రుగ్మతలను దూరం చేస్తుందని , మానసికంగా విద్యార్థులను దూరంగా చేసి పరీక్షల సమయంలో భయాన్ని పోగొడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ, ఉపాధ్యాయులు దత్తాద్రి, వ్యాయామ ఉపాధ్యాయురాలు శృతి, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.