విద్య సామగ్రి అందజేసిన విద్యార్థులతో బేల, జైనథ్ ఎస్సైలు మహేందర్, గౌతం
చిత్రం న్యూస్, జైనథ్: విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని బేల, జైనథ్ ఎస్సైలు మహేందర్, గౌతం పవార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమవంతుగా ప్రోత్సాహకాలను జైనాథ్, బేల ఎస్ఐ లు అందచేశారు. మంగళవారం జైనథ్ మండలం బెల్లూరి మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్య సామగ్రి (నోటుబుక్కులు, పెన్నులు, అట్టలు), పాఠశాల అవసరానికి మైక్ సెట్ ను ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము కూడ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ రోజూ ఇలా మీ ముందు ఎస్ఐ లుగా ఉన్నామని, కష్టాన్ని ఇష్టంగా మలచుకొని క్రమశిక్షణతో చదువుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని అన్నారు. చిన్న వయసులోనే చదువుపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు నేర్పించాలని, పాఠశాలకు పంపించడానికి తల్లితండ్రులు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్, ఉపాధ్యాయులు గౌసుద్దీన్, నరేందర్, అంగన్వాడి టీచర్ భూమబాయి, గ్రామ కార్యదర్శి చక్రవర్తి, ఆశ వర్కర్ వనజ, గ్రామస్తులు సోమ రాంరెడ్డి, సింగిరెడ్డి రాంరెడ్డి, కుమ్ర బాజీరావ్, రాజు, పొట్టెన్న, గ్రామస్తులు పొచ్చన్న, మహేందర్ రెడ్డి,శంకర్, ధర్ము, లచ్చు, రాకేష్, దేవిదాస్, యవకులు అభిలాష్ రెడ్డి, వాకేశ్, విజయ్ రెడ్డి, సూరజ్, సిద్దార్థ, ప్రేమ్ కుమార్, పవన్,అఖిల్, రఘువీర్,వంశీ,ఆకాష్, సుజీత్ తదితరులు పాల్గొన్నారు..