సబ్ కలెక్టర్ ను సన్మానిస్తున్న జనసేన పార్టీ నాయకులు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ ని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకుడు సుంకేట మహేష్ బాబు, నేతలు ఆర్.గంగప్రసాద్, పీ.నారాయణ్ సోమవారం శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా భైంసా డివిజన్ లోని పలు ప్రజాసమస్యలపై, బాసర ఆర్జేయూకేటీ విద్యార్థుల స్థితిగతులపై విన్నవించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సమస్య ను సామరస్యంగా పరిష్కారం చేస్తామన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.